చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు.. పండుగ సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్ష
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు.. పండుగ సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్ష

  • మన సంప్రదాయంలో దీపాలకు ప్రాముఖ్యం
  • ఆనందంగా, సురక్షితంగా జరుపుకోండి
  • ట్వీట్ చేసిన మాజీ సీఎం
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంప్రదాయంలో దీపాలకు ఎంతో ప్రాముఖ్యం ఉందన్న చంద్రబాబు.. ఇంటింటా దీపాలు వెలిగించి శుభాలను ఆహ్వానించే తెలుగు వారికి దీపావళి శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. దీపావళిని ఇంటిల్లిపాదీ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Chandrababu
Andhra Pradesh
deepavali

More Telugu News